బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహనదారుడి మృతి
హైదరాబాద్: బాలానగర్‌లో ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం మరొక ప్రాణాన్ని బలి తీసుకుంది. చలానా రాయడానికి రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే, బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ పోలీసులు ఓ బైక్‌ను ఆకస్మికంగా ఆపే ప్రయత్నం చేశారు. దీంతో అదుపుతప్పిన బైక్ కిందపడింది. ఆ బైక్‌ను నడుపుతున్న వ్యక్తి తలపై ఆర్టీసీ బస్సు నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆగ్రహించిన వాహనదారులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాణనష్టం జరిగిందని ఆరోపించారు. దీంతో బాలానగర్ నుంచి నర్సాపూర్ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ప్రస్తుతం పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఘటనపై స్థానికులలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.