హైదరాబాద్ లో భారీ వర్షం పలుచోట్ల టాఫిక్ అంతరాయం

By Ravi
On
హైదరాబాద్ లో భారీ వర్షం పలుచోట్ల టాఫిక్ అంతరాయం

సిటీలో భారీ వర్షం పలు ప్రాంతాలను అల్లకల్లోలం చేసింది. కేవలం 15నిమిషాల వ్యవధిలో ఉరుములు మెరుపులతో పడిన చినుకులు పలు లోతట్టు ప్రాంత వాసులను భయంతో వణికి పోయేలా చేసింది.  నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడిపోయే చాదర్ ఘట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. చాదర్ ఘాట్ నుండి మలక్ పేట వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనితో ట్రాఫిక్ పోలీసులు, జిహెచ్ఎంసి అధికారులు రంగంలోకి దిగారు రైల్వే బ్రిడ్జి కింద నీటిని పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. దిల్ షుఖ్ నగర్, కోఠి వైపు  నుండి వచ్చే వాహనాలను దారి మళ్లించారు.  15 నిమిషాల వర్షానికే ఇలా అయితే మూడురోజలపాటు భారీ వర్షాలు అని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక అదే నిజమైతే సిటీలో లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి అని అందరు ప్రశ్నిస్తున్నారు. మరోసారి హైడ్రా రంగంలోకి దిగుతుందా అంటూ చర్చలు మొదలైనాయి. ఇప్పుడు పడిన వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు రాబోయే వర్షా కాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాలలు, డ్రైనేజ్ లు శుభ్రం చేయాలని కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!