ఎన్టీఆర్ డ్రాగన్ లో ఆ హీరో స్పెషల్ రోల్?
ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రాబోతున్న లేటెస్ట్ సినిమా డ్రాగన్ పై రోజుకొక రూమర్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమా అప్డేట్ ప్రకారం మూవీలో ఓ సాలిడ్ స్పెషల్ రోల్ ను ప్రశాంత్ నీల్ డిజైన్ చేస్తున్నారట. ఈ రోల్ కోసమని బాలీవుడ్ స్టార్ హీరోని బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారట. ఈ హీరో మరేవరో కాదు.. హీరో రణ్ వీర్ సింగ్ అని టాక్. ఈ మూవీలో రణ్ వీర్ సింగ్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తారని టాక్. మరి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
అలాగే సినిమా టైటిల్ డ్రాగన్ అని, ఈ మూవీ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే బెస్ట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఒకటిగా నిలిచే ప్రయత్నం చేయాలని ప్రశాంత్ నీల్ గట్టిగా ట్రై చేస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకుని.. చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటికన్నా ఈ మూవీ బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ప్రాజెక్ట్ గా నిలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి.