సైడ్‌ట్రాక్‌లో స్ట్రాటజిస్ట్స్‌..!

By Ravi
On
సైడ్‌ట్రాక్‌లో స్ట్రాటజిస్ట్స్‌..!

  • ఏపీలో యాక్టివ్‌ అవుతున్న స్ట్రాటజిస్ట్స్‌
  • సర్వేల పేరుతో హడావిడి
  • ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారని పోస్ట్‌లు
  • ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత అంటూ రిపోర్ట్స్‌
  • అభివృద్ధి కార్యక్రమాల వేగం పెంచిన కూటమి సర్కార్‌
  • కూటమి ప్రభుత్వంపై వేచిచూసే ధోరణిలో జనం

ఏపీలో అప్పుడే స్ట్రాటజిస్ట్స్‌ యాక్టివ్‌ అవుతున్నారు. కూటమి సర్కార్‌ వచ్చి ఏడాది కాకుండానే సర్వేల పేరుతో హడావిడి మొదలుపెట్టారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో 75 శాతం అవినీతిలో కూరుకుపోయారని.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని..ఆధారాలతో సహా చెప్పేస్తామని హల్‌చల్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్న మాట నిజం. కానీ.. అది ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేంత రేంజ్‌లో లేదు. గత వైసీపీ పాలనతో పోల్చితే.. ప్రస్తుత ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి ఏపాటు అంటూ ప్రజల్లోనే ఓ రకమైన సాఫ్ట్‌కార్నర్‌ ఉంది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేల పనితీరుపై ఓ అంచనాకు రాకుండా.. వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మరోవైపు కొంతమంది స్ట్రాటజిస్ట్స్‌ ప్రతిపక్షం దగ్గర ముడుపులు పుచ్చుకుని.. అప్పుడే కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. సర్వే ఫలితాలు త్వరలో వెల్లడి అంటూ పోస్టులు పెడుతూ ప్రజల్లో కన్ఫ్యూజన్‌ క్రియేట్‌ చేస్తున్నారు. 

కూటమి సర్కార్‌ వచ్చిన ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అధికారంలోకి రావడంతోనే.. అన్నిచోట్ల రోడ్లు బాగు చేసింది. మరికొన్ని చోట్ల కొత్త రోడ్లు వేసింది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరిగాయి. అలాగే ఆగిపోయిన అమరావతి పనులు మళ్లీ మొదలయ్యాయి. అటు పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తికి కేంద్రం నుంచి నిధులు కూడా మంజూరయ్యాయి. ఈ టర్మ్‌లోనే అమరావతిని, పోలవరాన్ని పూర్తి చేసి ఏపీ ప్రజలకు కానుక ఇస్తానని సీఎం చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. ఇకపోతే.. మొదట్లో సూపర్‌సిక్స్‌ హామీలు కాస్త ఆలస్యం అవుతాయని చెప్పిన సర్కార్‌.. ఇప్పుడు వాటిని కూడా లైన్‌లో పెడుతోంది. దీంతో ఏపీ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వంపై సంతృప్తిగానే ఉన్నారు. దీంతో కూటమి సర్కార్‌పై వ్యతిరేకత వస్తుందనే విష ప్రచారానికి వైసీపీ.. పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్స్‌ను ప్రయోగిస్తోందనే టాక్‌ వినిపిస్తోంది. అందులోనూ గతంలో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసిన స్ట్రాటజిస్ట్స్‌.. కాస్తోకూస్తో.. ఫలితాలను దగ్గరగా అంచనా వేసిన స్ట్రాటజిస్ట్స్‌నే ఎంచుకుని.. వాళ్లతోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఇప్పటి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు అక్రమంగా ఆర్జిస్తున్నట్లు పాయింట్‌ న్యూస్‌ గతంలోనే వాళ్ల అవినితీపై అనేక కథనాలు ప్రచరించింది. ఐతే.. కొంతమంది ఎమ్మెల్యేలు అడ్డదారులు తొక్కినంత మాత్రానా.. మిగతావాళ్లను అలానే చూడలేం. మొత్తం ఎమ్మెల్యేల్లో 75 శాతం మంది అవినీతికి పాల్పడుతున్నట్లు కొంతమంది స్ట్రాటజిస్ట్స్‌ చెబుతున్న లెక్కలు మాత్రం పక్కాగా ఫేక్‌ అని తెలుస్తోంది. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అనేక కార్యక్రమాల్ని చక్కబెడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ గిరిజన గ్రామాల్లో వెలుగులు నింపుతున్నారు. ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ వాట్సప్‌ గవర్నెన్స్‌తో అనేక సేవల అందిస్తూ.. చక్కటి ఫలితాలు రాబడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఏపీ అభివృద్ధికి అనేక రకాల ప్రణాళికలు రచిస్తున్నారు. అటు కేంద్రం నుంచి కూడా సాయం పొందడంలో ఏపీ ముందు వరుసలో ఉంటోంది. ఇక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణని కూటమి ప్రభుత్వం రద్దుచేసింది. దీంతో అనేక వేల మంది స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులకు భరోసా దక్కింది. ఇలా అనేక రకాలుగా ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు మంచి చేస్తోంది. మరి ఈ స్ట్రాటజిస్ట్స్‌ రిలీజ్‌ చేయనున్న సర్వేలో ఏముందో చూడాలి.

Advertisement

Latest News