విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరు
By Ravi
On
లఖ్‌నవూలో శనివారం జరిగే విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్ అధ్యక్షతన జరుగనుంది.
ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు హాజరై డిస్కంల ఆర్థిక పరిస్థితులు, వాటి బకాయిల వల్ల ఏర్పడిన అప్పుల ఊబిలను సమీక్షించనున్నారు. డిస్కంలను నష్టాల నుంచి లాభాల బాటపై తీసుకెళ్లేందుకు, సంబంధిత అధికారులు తదితర అంశాలపై చర్చించనున్నారు.
అంతేగాక, రాష్ట్రాల డిస్కంలు నష్టాల నుంచి కోలుకోవడానికి, విద్యుత్ శాఖ మంత్రులు కేంద్రానికి పలు వినతులు చేస్తూ, కేంద్రం నుండి అందే పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను కోరే అవకాశముంది.
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్‌లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...