నగరంలో పలుచోట్ల ఎక్సైజ్ దాడులు.. డ్రగ్స్ అండ్ గంజాయి స్వాదీనం
హైదరాబాద్: ఎస్టిఎఫ్ బీ టీమ్ రెండు వేర్వేరు కేసుల్లో 2.78 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ మరియు 1.302 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఈ కేసుల్లో ఐదుగురిని అరెస్టు చేసిన అధికారులు, ఆరుగురు పరారీలో ఉన్నారని తెలిపారు.
డ్రగ్స్ పట్టివేత: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ బీ టీమ్ సీఐ బిక్షారెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించి 2.78 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ దాడిలో ఎస్‌కె మహ్మమద్ రహీమ్, మహ్మమద్ ఫక్రుద్దీన్‌ను అరెస్టు చేశారు.
ఈ కేసులో సౌదీ అరేబియాకు చెందిన సఫాన్ మరియు బెంగుళూరుకు చెందిన ఇబ్రహీమ్ జహీర్ అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.
గంజాయి పట్టివేత: ఇంతలో, లోయర్ ధూల్‌పేట్ జుంగూర్ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఎస్టిఎఫ్ బీ టీమ్, ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి 1.302 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కునాల్ సింగ్, వినోద్ సింగ్, హేమబాయ్‌లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు మరియు యాక్టివా హోండ వాహనాన్ని సీజ్ చేశారు.
ఈ కేసులో అనికేష్ సింగ్, అర్తిబాయ్, సరేన్, గణేష్ సింగ్‌లు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అభినందనలు: ఈ రెండు కేసుల్లో ఎస్టిఎఫ్ టీమ్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టర్ వి.బి.కమలాసన్‌రెడ్డి, ఎస్‌టిఎఫ్ బీ టీమ్ టీడర్ ప్రదీప్‌రావులు అభినందించారు.
సీఐ బిక్షారెడ్డి, ఎస్సైలు బాలరాజు, సంద్యా, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, మహేశ్వర్, కౌశిక్, శ్రీనివాసరెడ్డి ఈ దర్యాప్తులో భాగంగా పాల్గొన్నారు.