సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా

By Ravi
On
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా

రంగారెడ్డి జిల్లా,
ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద సోమవారం ఉదయం హైడ్రామా చోటు చేసుకుంది. నగరంలోని మూసాపేట నుంచి వచ్చిన రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి మరియు బసవరాజు, కొంతమంది కేర్‌టేకర్లతో కలిసి కోకాపేటలోని ఇంటి వద్దకు చేరుకున్నారు.ఇప్పటికే ఆ ఇంటిలో నివాసం ఉంటున్న లావణ్య అనే మహిళతో రాజ్ తరుణ్ తల్లిదండ్రుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. "ఇది మా కుమారుడి సొంత ఇల్లు. ఇప్పటివరకు కిరాయి ఇంటిలో ఉండటం వల్ల ఇప్పుడు ఇక్కడే వేరొక గదిలో నివాసముండాలని వచ్చాము" అని తల్లిదండ్రులు తెలిపారు. అయితే లావణ్య ఈ విషయాన్ని ఖండిస్తూ, "తనను ఇంటి నుండి గెంటివేయాలనే ఉద్దేశంతోనే వచ్చారు" అని ఆరోపించారు.లావణ్య తెలిపిన వివరాల ప్రకారం, తాను ఇప్పటికే రాజ్ తరుణ్‌తో కలిసి ఉండిందనీ, తమ మధ్య కేసు కోర్టులో నడుస్తోందనీ వెల్లడించారు. "ఇంటి లోపలికి వచ్చి, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. నాపై దౌర్జన్యానికి పాల్పడ్డారు" అంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇక రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, లావణ్య వారిని అడ్డగించింది. "ముందుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వస్తే మాత్రమే లోపలికి అనుమతిస్తాను" అంటూ స్పష్టం చేసింది.ఈ ఘటనకు సంబంధించి ఇంకా అధికారికంగా పోలీసుల స్పందన వెలువడాల్సి ఉంది. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టులో ఉన్న నేపథ్యంలో, ఇరు పక్షాల వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!