కురుమ సంఘం అధ్యక్షుడు పోల్కం బాలయ్య ఆధ్వర్యంలో  దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

By Ravi
On
కురుమ సంఘం అధ్యక్షుడు పోల్కం బాలయ్య ఆధ్వర్యంలో  దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.తెలంగాణ సాయుధ రైతంగ పోరాటంలో భాగంగా కొందరి చేతిలో ఉన్న వేలాది ఎకరాల భూమిని వారి చేతిలో నుంచి విముక్తి కల్పించి పేదలకు పంచిన పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన దొడ్డి కొమురయ్య ఆశయాలను ముందుకు తీసుకొని పోవాలని అందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.


దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయం.సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని మాజీమంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపిరిలూదిన సాయుధ పోరాట కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు.తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వారి త్యాగాలను స్మరించుకున్నారు.దొడ్డి కొమురయ్య అమరత్వం అందించిన చైతన్య స్పూర్తి, మలి దశ తెలంగాణ ఉద్యమంలోనూ కొనసాగిందని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పార్లమెంటరీ పంథాలో సాగిన శాంతియుత పోరాటంలో, సబ్బండ వర్గాలు తమ వంతుగా ఉద్యమించాయని, తమ ఆకాంక్షలను చాటడంలో దొడ్డి కొమరయ్య స్పూర్తి ఇమిడి వున్నదని  అన్నారు.

ఈ కార్యక్రమంలో కురుమ సంఘం అధ్యక్షుడు పోల్కం బాలయ్య, కురువ సంఘం కమిటీ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..! శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
శేఖర్‌, తిరుపతి TPN : శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్‌గా మాజీ కౌన్సిలర్ నాగమల్లి దుర్గాప్రసాద్‌ను నియమితులయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి...
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!
సిమెంట్ పరిశ్రమలపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ప్రతాపం..!
బెట్టింగ్ యాప్ భూతానికి మరో యువకుడు బలి..!
ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వహించాలి : అనురాగ్ జయంతి
ఇద్దరు కొడుకుల్ని చంపి ఆత్మహత్య చేసుకున్న మహిళ..!
జపాన్‌ పర్యటనలో తొలిరోజే రేవంత్‌ బృందం కీలక ఒప్పందాలు..!