శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
By Ravi
On
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని శరత్ సిటీ మాల్ వెనుక ఉన్న ఓ అపార్ట్మెంట్‌లో మాదకద్రవ్యాల నిల్వపై రంగారెడ్డి జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.ఈ దాడిలో ఉత్తరప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ కుమారుడు ఉన్నట్లు గుర్తించి, అతని వద్ద నుండి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే సమయంలో డీటీఎఫ్ బృందంతో వాగ్వాదం చోటు చేసుకుంది.నిందితుడు డ్రగ్స్‌ను ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎవరికీ సరఫరా చేస్తున్నాడు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు హైప్రొఫైల్ వ్యక్తి కుమారుడైన నేపథ్యంలో విచారణను గోప్యతగా కొనసాగిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికావచ్చే అవకాశముంది.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...