మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

By Ravi
On
మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు

* ఈ నెల 28న గ్రామ అభివృద్ధి సభలు

ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తమ కుటుంబ మూలాలున్న పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండల్లో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామస్తులు, అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి వాటిపై దృష్టిపెడతారు. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పేషీ అధికారులు ఈ సభలకి హాజరవుతారు. ఈ సందర్భంగా  గ్రామాల్లో ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.

Tags:

Advertisement

Latest News