ఆదర్శ రైతు కుటుంబానికి  నాయకుల పరామర్శ

By Ravi
On
ఆదర్శ రైతు కుటుంబానికి  నాయకుల పరామర్శ

TPN...C.N.MURTHY
P.GANNAVARAM
MAR..20

అంబాజీపేట కు చెందినఆదర్శ రైతు కొర్లపాటి నరసింహారావు మృతి పట్ల పలువురు నాయకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.ఈ మేరకు గురువారం  రాష్ట్ర టీడీపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణ బాబు, అమలాపురం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ ఛైర్మన్ అల్లాడ స్వామినాయుడు, అమలాపురం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కల్వకొలను తాతాజీ తదితరులు నర్సింహారావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వీరితో పాటు  అమలాపురం మునిసిపల్ కౌన్సిలర్ యేడిద శ్రీను, వేంకటేశ్వర  స్వామి దేవస్థానం ఛైర్మన్ జంగా అబ్బాయి వెంకన్న, మాజీ ఎంపిపి బొర్రా ఈశ్వర రావు, వంటెద్దు బాబు, వైసిపి నాయకుడు వంటెద్దు వెంకన్నాయుడు, మాచవరం మాజీ సర్పంచ్ సుంకర సత్యవేణి బాలాజీ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.

Tags:

Advertisement

Latest News