లిక్కర్ పాలసీలో తమిళనాడుని ఫాలో అయిన జగన్..!
- తమిళనాడు మద్యం పాలసీని ఫాలో అయిన జగన్
- ఏపీలో మాదిరిగానే తమిళనాడులో ఎప్పటినుంచో లిక్కర్‌స్కామ్
- లిక్కర్ మాఫియాలో డీఎంకే, అన్నాడీఎంకే మధ్య అండర్‌స్టాండింగ్
- రాజకీయ నేతల చేతుల్లో డిస్టిలరీలు
- లిక్కర్‌స్కామ్‌తో ఎన్నికల్లో ఆప్‌కు దారుణ ఓటమి
- జగన్ మెడకు చుట్టుకోనున్న ఏపీ లిక్కర్‌స్కామ్..?
- తమిళనాడులో ఇరకాటంలో పడిపోయిన డీఎంకే
- లిక్కర్‌స్కామ్‌ను ఆయుధంగా చేసుకోనున్న బీజేపీ
ఏపీలో వైసీపీ అమలు చేసిన లిక్కర్ పాలసీకి తమిళనాడునే స్ఫూర్తిగా తీసుకుందట. ఐతే.. తమిళనాడులో లిమిటెడ్‌గా జరుగుతున్న ఈ స్కామ్‌ని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జగన్ అన్‌లిమిటెడ్ చేసేశారు. అనుమతులు ఇవ్వడం నుంచి.. మద్యం సరఫరా వరకు అంతా వైసీపీకి చెందినవారే. ఇటు మద్యం షాపుల్లో ఉండేది కూడా వైసీపీ వాళ్లే. దీంతో మూడు ఫుల్లులు.. ఆరు క్వార్టర్లుగా మద్యం వ్యాపారం సాగింది. ఇకపోతే.. తమిళనాడులో ఎప్పటినుంచో ఈ లిక్కర్ మాఫియా నడుస్తోంది. అక్కడి అధికార, ప్రతిపక్షాల మధ్య అండర్‌స్టాండింగ్‌తోనే ఈ మాఫియా రన్ అవుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కుంభకోణం రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళనాడులో మద్యం షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అక్కడ 7 వేలకు పైగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రతీరోజు సుమారు 3 లక్షలకు పైగా మద్యం బాటిళ్లు సరఫరాకు సిద్ధంగా ఉంటాయి. అటు డిస్టిలరీస్ కూడా డీఎంకేతోపాటు అన్నాడీఎంకేకి చెందిన రాజకీయ నేతలవే. అధికార, ప్రతిపక్షాలు రెండూ కలిసి ఒకమాటపై నడిచేది ఈ విషయంలోనే. ఇలాంటి వ్యవహారం సాధారణంగా మనం సినిమాల్లో చూస్తుంటాం. కానీ.. తమిళనాడులో మాత్రం ఇది నిత్య సత్యం. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు.. మద్యం దుకాణాల ద్వారా వేల కోట్ల బ్లాక్‌మనీ.. రాజకీయ నేతల జేబులకు చేరుతున్నట్లు సమాచారం. ఐతే.. తమిళనాడులో ఇప్పటివరకు రెండు పార్టీలు మాత్రమే అధికారాన్ని పంచుకుంటూ వస్తున్నాయి. ఐతే.. డీఎంకే.. లేకుంటే అన్నాడీఎంకే. ఈ రెండు పార్టీలే అక్కడ అధికారంలో ఉండేవి. దీంతో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఈ స్కామ్ బయటికి రాలేదు. ఇప్పుడు ఈ స్కామ్‌ను బీజేపీ బయటపెట్టింది. ఇక ఈ స్కామ్‌ని చూసి.. ఏపీ జనాలు మరోసారి వైసీపీ పాలనను గుర్తుచేసుకుంటున్నారు.
గతంలో ఏపీలో జగన్ అధికారంలోకి రాగానే.. మద్యంపై కొత్త పాలసీని తీసుకొచ్చారు. ప్రైవేట్‌కు బదులు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించే విధానాన్ని అమలు చేశారు. ఇకపోతే.. మద్యం సరఫరాదారులు కూడా వైసీపీకి చెందిన నేతలే కావడం ఇక్కడి కొసమెరుపు. మరోవైపు జగన్ ఏపీని పరిపాలించినంత వరకు కూడా రాష్ట్రంలో కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదని.. అవన్నీ టీడీపీ హయాంలో ఏర్పాటు చేసినవే అని వైసీపీ నేతలు ప్రచారం చేశారు. కానీ.. ఉన్న డిస్టిలరీలను అన్నింటినీ వైసీపీ నేతలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. వాటి ద్వారానే దుకాణాలకు మద్యం సరఫరా చేసేవారు. అప్పట్లో కేవలం జే బ్రాండ్స్ మాత్రమే దొరికేవి. ఇతర బ్రాండ్స్ అన్నింటిని నిషేధించారు. ఇక ఈ జే బ్రాండ్స్ అన్నీ కూడా వైసీపీ నేతల నియంత్రణలో ఉన్న డిస్టిలరీస్‌లో తయారయ్యేవి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఈ బ్రాండ్స్‌కు ఎక్కువ అర్డర్స్ వచ్చేవి. అలా ఈ డిస్టిలరీస్ నుంచి దుకాణాలకు లిక్కర్ సరఫరా అయ్యేది.
ఏపీలో జగన్ అన్ని డిస్టిలరీలపై నియంత్రణ సాధించగలిగారు. మద్యం దుకాణాల నిర్వహణను తమ చెప్పుచేతల్లో అమలు చేశారు.
ఇకపోతే.. ఈ మద్యం లాబీయింగ్ ఢిల్లీ పీఠాన్ని కూడా తాకింది. ఢిల్లీలో ఆప్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లిక్కర్‌స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో చాలామంది పెద్ద తలకాయలు తీహార్‌లో జైలు జీవితం కూడా గడిపారు. ఐతే.. ఢిల్లీ లిక్కర్‌స్కామ్‌కు ఏపీలో బీజం పడిందనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీలో ఏపీలో ఉన్నట్లు డిస్టిలరీలు లేవు. అందుకని.. ఏపీ మద్యం సరఫరాదారులు అక్కడ ఓ స్కామ్‌కు స్కెచ్ గీశారు. ఏపీలో తయారైన మద్యాన్ని ఇక్కడ డిస్టిలరీస్ నుంచి ఢిల్లీ సరఫరా చేసి కోట్లు దండుకోవచ్చని ప్లాన్ వేశారు. కానీ.. ఆ స్కామ్ బయటపడడంతో.. కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఇకపోతే.. ఏపీలో మద్యం కుంభకోణం కూడా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏ క్షణమైనా ఈ స్కామ్ జగన్ మెడకు చుట్టుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక తాజాగా తమిళనాడులో బయటపడ్డ ఈ స్కామ్ డీఎంకేని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడులో బీజేపీకి ఈ స్కామ్ ఓ ఆయుధంగా మారింది. మరి ఈ లిక్కర్‌స్కామ్ ఎఫెక్ట్ డీఎంకేని అధికారానికి దూరం చేస్తుందా..? బీజేపీ బలపడేందుకు ఉపయోగపడుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ..