మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయం కలిపించాలి 

By Ravi
On
మీటర్ రీడర్స్ కు ప్రత్యామ్నాయం కలిపించాలి 

ఏలూరు : రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ కు విద్యుత్ శాఖ లోనే ప్రత్యామ్నాయంగా ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గురువారం  ఏలూరు విద్యుత్ శాఖ ఎస్ ఈ  కార్యాలయం వద్ద ఏఐటీయూసీ అనుబంధ ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం యూనియన్ నాయకులు ఎస్ ఈ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా యూనియన్ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వర రావు, విద్యుత్ మీటర్ రీడర్స్  యూనియన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోశాధికారి కే మల్లేశ్వరరావు మాట్లాడారు. 2024 ఫిబ్రవరి మాసంలో విద్యుత్ శాఖ సీ ఎం డి రాష్ట్ర నాయకులతో చేసుకున్న లిఖితపూర్వక ఒప్పందంలోని హామీలను తక్షణమే అమలు చేయాలన్నారు. స్మార్ట్ మీటర్స్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోతున్నారన్నారు. విద్యుత్ మీటర్ రీడర్స్ ను వాళ్ల విద్యా అర్హత ను బట్టి విద్యుత్ శాఖలోనే ఉపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శులు జి దుర్గారావు, డి శంకర అప్పారావు ఏ ఐ టి యు సి జిల్లా సహాయ కార్యదర్శి ఏ అప్పలరాజు, విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ నాయకులు కే శ్రీధర్, వి నారాయణ, కే శ్రీనివాసరావు, కే వెంకట్రావు,  కే మురళి జంగారెడ్డిగూడెం డివిజన్, ఏలూరు డివిజన్ కు సంబంధించిన విద్యుత్ మీటర్ రీడర్స్ పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..