"కార్యకర్తే అధినేత" అన్న మాటను ఆచరణలో పెట్టిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు

By Ravi
On

WhatsApp Image 2025-03-25 at 6.41.24 PMపాతపట్నం: తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలే పార్టీ బలంగా ఎదగడానికిచేతకారిగా ఉన్నారు. ఈ సందర్బంగా, శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు 'కార్యకర్తే అధినేత' అన్న మాటను ఆచరణలో పెట్టారు.

అతని కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన 'కార్యకర్తే అధినేత' సమావేశంలో ఎమ్మెల్యే గోవిందరావు మాట్లాడుతూ, "తెలుగుదేశం పార్టీకి దేశంలో ఎటువంటి పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం ఉంది. ఇటీవలి కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చరిత్ర సృష్టించి, ఈ పార్టీ ప్రపంచంలో అతిపెద్ద కుటుంబంగా మారింది" అని అన్నారు.

"ప్రతి బుధవారం నియోజకవర్గంలోని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తా" అని ఆయన తెలిపారు.

అలాగే, "పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలు తమ కష్టాలను అధిగమించి పార్టీకి బలం ఇచ్చారు. వారి పాత్రపై ఇంకా అభినందనలు తెలియజేస్తూ, ఇటీవల చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సానుకూలంగా పనిచేసిన నాయకులను సన్మానిస్తాం" అని చెప్పారు.

ఈ సమావేశంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ తొట్టంబేడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...
శరత్ సిటీ మాల్ వెనుక అపార్ట్మెంట్‌లో డ్రగ్స్ పట్టివేత
సినీ నటుడు రాజ్ తరుణ్ ఇంటి వద్ద హైడ్రామా
నాన్ డ్యూటీ లిక్కర్‌పై దాడులు పెంచండి : ఆర్ఆర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
జనసేన ఆధ్వర్యంలో అంబలి ప్రసాదం వితరణ..!
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..
అక్రమ వలసదారులకు ట్రంప్ బంపర్ ఆఫర్..