చాకచక్యంగా కేసులను ఛేదించిన కాశీబుగ్గ - సిసిఎస్ పోలీస్ బృందాలు
జిల్లాలో దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసులు. వారి వద్ద నుండి సుమారు 45 లక్షలు బంగారు,వెండి, డైమెండ్ ఆభరణాలు రెండు ద్విచక్ర వాహనాలు ఒక స్కార్పియో వాహనాన్ని స్వాధీనం. 37 తులాల బంగారం,20 తులాల వెండి ఆభరణాలు ఇతర కేసు ప్రాపర్టీ రికవరీ చేసిన కాశీబుగ్గ పోలీసులు. ముద్దాయిల పై 9 పోలీసు స్టేషన్లో 17 కేసులు ఇదివరకే నమోదు. చాకచక్యంగా కేసులను ఛేదించిన కాశీబుగ్గ - సిసిఎస్ పోలీస్ బృందాలు.కేసు పూర్వపరాలపై పత్రిక సమావేశం నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కె.వి.మహేశ్వర రెడ్డి ఐపీఎస్ .
కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో నమోదు కాపాడిన బంగారం వెండి ఆభరణాలు దొంగతనం కేసులో పట్టుబడిన నిందితులను పోల భాస్కరరావు మరియు నరసింగరావు కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా వారి వద్ద నుండి సుమారు 37 తులాల బంగారు ఆభరణాలు 20 తులాల వెండి వస్తువులు, డైమండ్ ఆభరణాలు,నగదు 25 వేలు రెండు ద్విచక్ర వాహనాలు,స్కార్పియో స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.
ప్రతిభకు ప్రశంస:- పై కేసును ఆదనపు ఎస్పీ క్రైమ్ పి.శ్రీనివాస రావు పర్యవేక్షణలో కాశీబుగ్గ సబ్ డివిజన్ డీఎస్పీ వి.వి వెంకటప్పారావు ఆధ్వర్యంలో చాకచక్యంగా వ్యవహరించి కేసు చేదించటం లో ప్రతిభ కనబరిచి,B.సూర్య చంద్ర మౌళి,ఇన్స్పెక్టర్ , శ్రీకాకుళం, P.సూర్య నారాయణ,ఇన్స్పెక్టర్, కాశీబుగ్గ పోలీస్ స్టేషన్, K. మధుసూదనరావు, , S.శ్యాంసుందరరావ్,, K. భాస్కరరావు, N. విజయ్ కుమార్ Ch. హరీష్, ., మరియు S. ఉషాకిరణ్, , కాశీబుగ్గ PS అను వారిని జిల్లా ఎస్పి శ్రీ KV మహేశ్వరరెడ్డి, IPC గారు ప్రత్యేకంగా అభినందించారు.