శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే గోండు శంకర్ సమీక్ష

By Ravi
On
శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే గోండు శంకర్ సమీక్ష

WhatsApp Image 2025-03-25 at 11.44.44 AMశ్రీకాకుళం, 24 మార్చి 2025: శ్రీకాకుళం రూరల్ మండలం కిల్లిపాలెం ప్రాంతంలో చెరువులు, సాగునీటి కాలువలు, డ్రైనేజీలు, సీసీ రోడ్లు వంటి అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోండు శంకర్ మాట్లాడుతూ, చెరువుల పరిరక్షణ, సాగునీటి కాలువలు పనులు సకాలంలో జరిపే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని, చెరువులు మున్ముందు పనిచేస్తే సాగునీటి కోసం ఉపకరిస్తాయని తెలిపారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, సీసీ రోడ్ల నిర్మాణం, తదితర అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాక, కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సచివాలయ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News