ఐదో సచివాలయంలో పి ఫోర్ పథకం సంబంధించి పోస్టులను విడుదల చేస్తున్న కౌన్సిలర్ అల్లవరం నగేష్
కాకినాడ జిల్లాపిఠాపురం పట్నంలో ప్రభుత్వ, దాతలు, ప్రజలు సహకారంతో( p4) పథకం సంబంధించి 5వ సచివాలయంలో పదో వార్డు కౌన్సిలర్ అల్లవరపు నగేష్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరిగింది.
ఈ సందర్భంగా కౌన్సిలర్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రం మరియు ప్రజలు జీవితాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో వినూత్న కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, అమరావతి, పొలవరంతో పాటు రాష్ట్రంలో ప్రజలు అందరూ వాళ్ళ కాళు పైన వాళ్ళే నిలుచునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందులో భాగంగా ఈ P4 పథకం ఇందులో పేదలకు ప్రభుత్వం, దాతలు మరియు ప్రజలు సహకారంతో పేదలను పెద్దలుగా చేయాలేనే ప్రభుత్వ ఉద్ధేశం అందుకే అవకాశం వున్న ప్రతీ వారు ఈ P4 పథకంలో చేరాలని తెలియచేశారు.
కొత్త పింఛన్లు కోసం ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కట్టుబడి వుంది త్వరలోనే కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు మరియు ఇళ్ల స్థలాలు అరుహులైన ప్రజలకు కూటమి ప్రభుత్వం అందిస్తుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సచివాలయం అడ్మిన్ G. గంగాధర్,వెల్ఫేర్ సెక్రటరీ j. వరలక్ష్మి, ఎడ్యుకేషన్ సెక్రటరీ y. వెంకటలక్ష్మి, హెల్త్ సెక్రటరీ R. భవానీ, ప్లానింగ్ సెక్రటరీ v. మేరీ, అమునిటీ సెక్రటరీ k. సోనీ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు