పేదలకు పక్కా గృహాల కోసం సమీక్ష
By Ravi
On
పాతపట్నం:
పేదలకు అన్ని వసతులతో కూడిన పక్కా గృహాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు తెలిపారు. సోమవారం ఆయన పాతపట్నం ఎమ్మెల్యే కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన, అర్హత ఉన్నవారు గృహాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలనలు చేయాలని సూచించారు. గతంలో తెదేపా హయాంలో మంజూరైన గృహాల పట్ల విమర్శలకు తావు లేకుండా గృహ నిర్మాణాలు జరగాలని ఆయన ఆదేశించారు. ఈ సమావేశంలో ఐదు మండల ఏఈలు, జేఈలు సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Latest News
06 Apr 2025 17:34:52
హైదరాబాద్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారి ఆట కట్టించారు.సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు. ఈ ఇద్దరు కలిసి సంయుక్తంగా దాడులు జరిపారు....