బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ వేగవంతం - విష్ణుప్రియ, రీతూ చౌదరీపై మరోసారి ప్రశ్నలు
By Ravi
On
హైదరాబాద్, 24 మార్చి 2025: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మరియు ఆర్థిక లావాదేవీలపై పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియ మరియు రీతూ చౌదరిను నేడు మరోసారి విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్, యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, రీతూ చౌదరి లాంటి వ్యక్తులను విచారించబడింది.
ఈ రోజు పంజాగుట్ట పోలీసులు మరోసారి విష్ణుప్రియ మరియు రీతూ చౌదరి లను విచారించనున్నారు. ఈ కేసులో ఇంకా హర్ష సాయి మరియు ఇమ్రాన్ వంటి ప్రధాన నిందితులు పోలీసులకు అందుబాటులో లేరు.
ఈ కేసులో 11 మంది పై కేసు నమోదు కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైకోర్టుకు చేరుకున్న విష్ణుప్రియ, తనపై నమోదైన రెండు FIR లను క్వాష్ చేయాలంటూ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ నేడు జరుగుతుందని తెలుస్తోంది.
Tags:
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...