డెంగ్యూ భయం గుప్పిట్లో దుండిగల్ లోని పలు కాలనీలు

By Ravi
On
డెంగ్యూ భయం గుప్పిట్లో దుండిగల్ లోని పలు కాలనీలు

దుండిగల్ మున్సిపాలిటీలో భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు 15రోజులుగా మురుగునీటిలోనే నివాసం అంటున్న జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మల్లంపేట రామచంద్రయ్య కాలనీ వాసులు

 

శివారు ప్రాంతాలలోని దుండిగల్ మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. నివాసాల మధ్య డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా మురుగునీటితో ప్రజలు సావాసం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని తీవ్ర అవస్థలు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులు ఆరోగ్యాలు పాడవుతున్న పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానికులు వేడుకుంటున్నారు.

Tags:

Advertisement

Latest News