సర్దార్ పాపన్న గౌడ్ మహారాజ్‌కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘన నివాళి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 315వ వర్దంతి సందర్భంగా నివాళులర్పించిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శనీయుడని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఢిల్లీలో సర్వాయి పాపన్న 315వ వర్ధంతి సందర్భంగా పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లు రవి, ఎంపీ కావ్య, పోరిక బలరాం నాయక్, రఘురాం రెడ్డి, గడ్డం వంశీకృష్ణ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..