ANI తో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై కీలక వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని కాపాడింది బీఆర్ఎస్ ప్రభుత్వం.ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు.ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు.సీఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు.యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది.పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా.ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి.ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణం పై ఎంత ఒత్తిడి పెరుగుతుందొ ఆలోచించాలి.బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదు.మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి .కానీ మై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు .పేదలు, మూగజీవులు ఉంటేనేమో బుల్డోజర్లను ప్రయోగిస్తారు... పెద్దవాళ్లనేమో ముట్టుకోరు