గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ కు స్వాగతం పలికిన ఎసిఎ అధ్యక్షుడు ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
By Ravi
On
వైజాగ్: ఐపీఎల్ లీగ్‌లో భాగంగా సోమవారం వైజాగ్ ఎసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించేందుకు గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ మరియు సమీరా నజీర్ దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మరియు ఆయన భార్యకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఎసిఎ) అధ్యక్షుడు, ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), ఎసిఎ కార్యదర్శి రాజ్యసభ ఎంపి సానా సతీష్, ఎసిఎ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ లతో కలిసి పుష్పగుచ్చం అందించి ఘనస్వాగతం పలికారు.
అనంతరం, గవర్నర్ దంపతులతో కలిసి క్రికెట్ మ్యాచ్ వీక్షించారు. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తమ ఆహ్వానాన్ని స్వీకరించి మ్యాచ్ చూడటానికి వచ్చారని, ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ సోషల్ మీడియా ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
Tags:
Latest News
07 Apr 2025 14:35:14
జపాన్ లో ఓ మెడికల్ ట్రాన్స్పోర్టు హెలికాప్టర్ కూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన ఆ దేశ నైరుతీ దిశలో చోటు చేసుకుంది. ఈ...