రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి! – దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

ఆదివారం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ధూప దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణా రూపొందించిన విశ్వవసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని మరియు భగవంతుని కృప వలన అది సాధ్యం అవుతుందని" ఆకాంక్షించారు.
ఈ సందర్భంలో మంత్రి అర్చకులను ఉద్దేశించి, "మీ వంతు సహకారంతో భగవంతుని ప్రతిరోజూ అర్చన చేసి ప్రజల క్షేమం కోసం ప్రార్థించండి" అని సూచించారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్చకులకు ప్రతినెలా వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో అర్చకులకు మెరుగైన వేతనాలు అందించే దిశగా తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో శైలజ రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, రీజనల్ కమిషనర్ రామకృష్ణారావు తదితర ప్రముఖులు పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దౌలతాబాద్ వాసుదేవ శర్మ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ, "ఈ నామ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం సుసంపన్నంగా, వెలుగొందుతుందని" ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అర్చకుల ఆశయ సాధన కోసం రాష్ట్ర సంఘం నిరంతర కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్నవజ్జల ప్రసాద్ శర్మ, తిరునగరి వెంకటాద్రి స్వామి, కోశాధికారి నందనం హరికిషన్ శర్మ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫణి కుమార్ శర్మ, కన్వీనర్ అమరేశ్వర శర్మ, విశాలాక్షి, మహేశు, రవికుమార్, లక్ష్మీకాంతాచార్యులు ఇతర ప్రముఖులు, అర్చకులు, మరియు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
Related Posts
Latest News
.jpg)