హాస్టల్స్ ను పర్యటించిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు.
By Ravi
On
పార్వతీపురం మన్యం జిల్లా,
స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు గురు వారం జిల్లాలోని పలు హాస్టళ్లను, స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.తొలుత కురుపాం మండలంలోని రేషన్ డిపో, ఎండియు వెహికల్, MLS పాయింట్, అంగన్వాడి సెంటర్, మోడల్ స్కూల్, గవర్నమెంట్ హై స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం నర్సిపురం మరిపివలస, జోగింపేట ప్రాంతాలలో గల అన్ని రకాల హాస్టల్స్ ను పర్యటించి, అక్కడ అమలుచేస్తున్న మెనూను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి వై.కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి డా. టి.కనకదుర్గ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డా. టి.జగన్మోహన రావు,ఫుడ్ కమిటీ సభ్యులు,విద్యాశాఖ అధికారులు, ఐసిడిస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
07 Apr 2025 13:04:24
పెళ్లి తంతులో ఏ సంప్రదాయంలో అయినా ఎన్నో రకాల సంప్రదాయాలు ఉంటాయి. అలా పెళ్లికొడుకు చెప్పులు దాచిపెట్టి.. పెళ్లి కూతురి తరపున బంధువులు ఆట పట్టించి డబ్బులు...