రామ్ చరణ్ పెద్ది సరికొత్త రికార్డ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజంట్ పెద్ది అనే మూవీతో తన కెరీర్ కు కమ్ బ్యాక్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నారు. ఉప్పెనతో హిట్ అందుకున్న బుచ్చిబాబు సానతో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మూవీ టీమ్ ఇప్పటికే ప్లాన్ చేశారు. ఇక శ్రీరామ నవమి స్పెషల్ గా పెద్ది మూవీ నుండి అఫిషియల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో రామ్ చరణ్ లుక్ అండ్ ఎలివేషన్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి. ఇక డైలాగ్స్ కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ప్రజంట్ ఈ గ్లింప్స్ ఆల్ టైమ్ సాలిడ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది.
టాలీవుడ్ లో గ్లింప్స్ ఆల్ టైమ్ రికార్డ్స్ లో సరికొత్త రికార్డ్ తో రామ్ చరణ్ సంచలనం క్రియేట్ చేశారు. కేవలం పెద్ది గ్లింప్స్ రిలీజ్ అయిన 18 గంటల్లోనే 26.17 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ ను క్రియేట్ చేసింది. వ్యూస్ పరంగా పెద్ది గ్లింప్స్ కొత్త రికార్డులని క్రియేట్ చేస్తూ.. రామ్ చరణ్ ఫ్యాన్స్ కు సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది. ఇక గ్లింప్స్ రిలీజ్ అయిన 24 గంటల్లో 30+ మిలియన్స్ తో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. మొత్తానికి వ్యూస్ విషయంలో పెద్ది గ్లిమ్స్ టాలీవుడ్ లో ఉన్న రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ తో ట్రెండ్ ను సెట్ చేసింది.