హాస్టల్స్ ను పర్యటించిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు.
By Ravi
On
పార్వతీపురం మన్యం జిల్లా,
స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు గురు వారం జిల్లాలోని పలు హాస్టళ్లను, స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.తొలుత కురుపాం మండలంలోని రేషన్ డిపో, ఎండియు వెహికల్, MLS పాయింట్, అంగన్వాడి సెంటర్, మోడల్ స్కూల్, గవర్నమెంట్ హై స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం నర్సిపురం మరిపివలస, జోగింపేట ప్రాంతాలలో గల అన్ని రకాల హాస్టల్స్ ను పర్యటించి, అక్కడ అమలుచేస్తున్న మెనూను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా పౌర సరఫరాల అధికారి వై.కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ పి.శ్రీనివాసరావు, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి డా. టి.కనకదుర్గ, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారి డా. టి.జగన్మోహన రావు,ఫుడ్ కమిటీ సభ్యులు,విద్యాశాఖ అధికారులు, ఐసిడిస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
10 Apr 2025 17:43:06
ఈనెల 11 నుంచి నల్లమలలో ప్రారంభం కానున్న సాహసయాత్ర
ఏడాదిలో మూడురోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అవకాశం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌పరిధిలో కొండలు, లోయల్లో ప్రకృతి రమణీయ...