బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య?
నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ లైనప్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆయన సిల్వర్ స్క్రిన్ తో పాటు బుల్లితెర మీద కనిపిస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రూవ్ చేశారు. తన మార్క్ తో ఓటీటీలో ది మోస్ట్ ఎంటర్ టైనింగ్ రియాలిటీ టాక్ షోతో ట్రెండ్ ని సెట్ చేశారు. మరి ఇప్పుడు ఆయన తన అసలు సిసలు స్టైల్ ను ఆడియన్స్ కు అందించబోతున్నట్లు తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ 8 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ 9 వ సీజన్ ను స్టార్ట్ చేసే అవకాశాలు ఉండగా.. ఈ సారి బిగ్ బాస్ కు హోస్ట్ గా బాలయ్య వస్తే ఎలా ఉంటుంది అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
అందుకోసమే టీమ్ బాలయ్యతో సంప్రదింపులు చేస్తున్నారని టాక్. నార్మల్ గా ప్రెస్ మీట్స్ లో, మూవీ సక్సెస్ అండ్ ఆడియో ఫంక్షన్స్ లో చాలా రెబల్ గా కనిపిస్తూ ఆడియన్స్ ఎంటర్ టైన్ చేస్తుంటారు. మరి బిగ్ బాస్ కి హోస్ట్ అయితే ఛానల్ కి టీఆర్పీ రేటింగ్స్ బ్రేక్ అవుతాయి. అంతేనా.. కంటెస్టెంట్స్ ని కంట్రోల్ చేసి షో ని పర్ఫెక్ట్ గా నడిపించడం మాస్ లెవెల్ లో జరుగుతాయి. అయితే దీనికి ఇంకా అఫిషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఏది ఏమైనా బిగ్ బాస్ హోస్ట్ బాలయ్య వస్తే మాత్రం ఆ కిక్కే వేరబ్బా..