బ్యాక్ టు బ్యాక్ లైనప్ తో బాలయ్య..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో సంక్రాంతి స్పెషల్ గా డాకు మహారాజ్ తో హిట్ కొట్టారు. ఈ మూవీ రెగ్యులర్ స్టోరీనే అయినా డిఫరెంట్ విజువలైజేషన్ తో మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు అదే ఎనర్జీతో డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బ్లాక్ బస్టర్ అఖండకు సీక్వెల్ ను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా నందమూరి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరికొంతమంది డైరెక్టర్స్ దగ్గర్నుండి స్టోరీస్ వింటున్నారు.
డైరెక్టర్ హరీష్ శంకర్ బాలయ్య కోసం కథ రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారీ బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉంది. నెక్ట్స్ గోపిచంద్ మలినేని కూడా ఇప్పటికే స్టోరీ వినిపించారు. ఆ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. ప్రజంట్ గోపిచంద్ మలినేని తన మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్యతో మళ్లీ కాంటాక్ట్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బాలయ్య లైనప్ లో మరో ఇద్దరు డైరెక్టర్స్ చెప్పిన స్టోరీస్ కూడా లైన్ లో ఉన్నాయి.