అఖిల్ 6.. గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్..
కెరీర్ లో సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న టాలీవుడ్ హీరోల్లో అక్కినేని అఖిల్ కూడా ఒకరు. ఆయన అక్కినేని వారసుడైనా సరైన హిట్ లేకపోవడంతో స్టార్ డమ్ ను సంపాదించుకోలేకపోతున్నారు. ఆయన లాస్ట్ సినిమా ఏజెంట్ మూవీపై అంచనాలు పెంచినా.. రిలీజ్ తర్వాత సక్సెస్ కాలేకపోయారు. స్టోరీస్ విషయంలో మూవీ ఫెయిల్ అవుతుందా.. లేదా అఖిల్ నుండి ప్రేక్షకులు ఎలాంటి జానర్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారనేది అఖిల్ సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు అనేది ఓ రూమర్. ఏది ఏమైనా తన 9 ఏళ్ల సినీ కెరీర్ లో సాలిడ్ హిట్ ను అందుకోవాలని చాలా ట్రై చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరుతో కలిసి అఖిల్ ఓ మూవీని సెట్ చేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. మురళీ కిషోర్ వినరో భాగ్యమూ విష్ణు కథ మూవీ తిరుపతి బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఇప్పుడు అఖిల్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. సో లేటెస్ట్ ఈ సినిమా గ్లింప్స్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 8 న అఖిల్ బర్త్ డే. కాబట్టి ఫిల్మ్ టీమ్ అఖిల్ మూవీ టైటిల్ గ్లింప్స్ ను రివీల్ చేస్తున్న అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయగా.. పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.