కృష్ణాజిల్లా ఉయ్యూరులో ఉగాది పురస్కారం అవార్డు అందుకున్న పిఠాపురం వాస్తవాలు కొండేపూడి శంకర్రావు
కాకినాడ జిల్లా, పిఠాపురం:
శ్రీ సూర్యరాయ విద్యా గ్రంధాలయం కార్యదర్శిగా ఉన్న కొండేపూడి శంకర్రావుకి కృష్ణాజిల్లా ఉయ్యూరులో జరిగిన "సరసభారతి" సాహితీ సంస్థ నిర్వహించిన ఉగాది పురస్కార అవార్డు కార్యక్రమంలో ఉగాది పురస్కారం అందడం జరిగింది.
శంకర్రావు మాట్లాడుతూ, ఈ అవార్డును అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ పురస్కారాన్ని అందించడం ద్వారా గ్రంధాలయ ప్రాముఖ్యతను మరింత పెంచుకోవడానికి అవకాశం దక్కినట్లు చెప్పారు. వారు తమ రాయన నైపుణ్యం మరియు సాహిత్య సంస్కృతికి కృషి చేసినందుకు ఈ అవార్డును పొందడం గర్వకారణంగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సరసభారతి సాహితీ సంస్థ అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్, శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ Y. B. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్, అలాగే రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన సాహితీ వేత్తలు పాల్గొన్నారు.
శంకర్రావు తనకు ఈ అవార్డును అందజేసిన సరసభారతి సాహితీ సంస్థ కు కృతజ్ఞతలు తెలియజేశారు.