శిండేపై కామెంట్స్.. బాంబే హైకోర్ట్ లో కునాల్ కమ్రా!

By Ravi
On
శిండేపై కామెంట్స్.. బాంబే హైకోర్ట్ లో కునాల్ కమ్రా!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిండేపై స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై ఫైల్ చేసిన కేసులను కొట్టివేయాలని కునాల్ బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించారు. తాను రాజ్యాంగం ప్రకారమే నియమ నిబంధనలతో తన షోను నిర్వహిస్తున్నానని అన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, జీవించే హక్కును ఉల్లంఘించేలా తనపై కేసులు ఫైల్ చేశారని తన పిటీషన్ లో తెలిపారు. అయితే ఈ కేసు విచారణ ఏప్రిల్ 21 న జరగనుంది. ఇక రీసెంట్ టైమ్స్ లోనే ముంబాయిలోని ఓ హోటల్ లో కునాల్ స్టాండప్ కామెడీ షో చేశారు. 

ఈ ప్రోగ్రామ్ లో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ శిండేను దేశ ద్రోహిగా కామెంట్ చేస్తూ.. దిల్ తో పాగల్ హై అనే మూవీలోని సాంగ్ కి పేరడీలా కునాల్ సాంగ్ పాడటంతో ఈ వివాదం చెలరేగింది. రాష్ట్ర డిప్యూటీ సీఎంపై అలాంటి కామెంట్స్ ఎలా చేస్తారంటూ కునాల్ కమ్రాపై పలు కేసుల్ని నమోదు చేశారు. కాగా ఈ కామెంట్స్ ని నిరసనగా ఆ స్టూడియోపై శివసేన కార్యకర్తలు దాడికి సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి.. కునాల్ కు మూడు సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే కునాల్ ఈ సమన్లకు రెస్పాన్డ్ అవ్వలేదు. తాజగా ఆయన బాంబే హైకోర్ట్ ను ఆశ్రయించడం జరిగింది. అయితే కునాల్ ను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరడంతో.. ఏప్రిల్ 7 వరకు రక్షణ కల్పిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కునాల్ కమ్రా చేసిన కామెంట్స్ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.

Tags:

Advertisement

Latest News

#Draft: Add Your Title #Draft: Add Your Title
ఎమ్మెల్సీ విజయశాంతికి బెదిరింపులు..! కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు చంపుతామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి, ఆమె భర్త శ్రీనివాస్...
తాడ్‌బండ్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి..!
మాజీ కార్పొరేటర్‌ భర్త కబ్జాల పర్వం..!
వరంగల్‌ జాబ్‌ మేళాలో తొక్కిసలాట..!
ఉప్పల్ స్టేడియంలో టికెట్ల పంపకంపై విజిలెన్స్ డీజీ ఆరా
కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన
సెల్‌ఫోన్స్‌ చోరీ ముఠాలు అరెస్ట్‌