స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

By Ravi
On
స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 

పాన్ ఇండియా రెబల్ హీరో ప్రభాస్ ప్రజంట్ భారీ సినిమాలు లైనప్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ లైనప్ లో మోస్ట్ వాంటెడ్ మూవీ అంటూ అది స్పిరిట్. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి ప్రభాస్ చేస్తున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై డైరెక్టర్ సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ఈ సినిమాని మెక్సికోలో స్టార్ట్ చేస్తున్నట్లుగా సందీప్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా మొత్తం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ తో కొనసాగుతుందని, ఆడియన్స్ ప్రభాస్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలాగే చూస్తారని అన్నారు. ఇక కథ పరంగా కూడా ఉత్కంఠతో ఉంటుందని.. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ స్పిరిట్ సబ్జెక్ట్ ను ఎంజాయ్ చేస్తారని సందీప్ రెడ్డి వంగా కన్ఫార్మ్ చేశారు. 

నిజానికి అటు ప్రభాస్ ఇటు సందీప్ ఇద్దరూ యాక్షన్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను స్టార్ట్ చేసిన ఇప్పుడు ఈ సినిమా జానర్ లో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ప్రభాస్ ను పోలీస్ గెటప్ లో చూడలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆయన్ను చాలాసార్లు ప్రభాస్ జానర్ లో సినిమా తీస్తే బావుంటుందని ఆశపడ్డారు. బట్ ఇప్పటి వరకు ఆ ఛాన్స్ రాలేదు. అలాగే ప్రభాస్ కు పోలీస్ గెటప్ లో మూవీ అంటే స్టోరీతో పాటు యాక్షన్ పార్ట్ కూడా సాలిడ్ గా ఉండాలి. మరి అలాంటి క్యారెక్టరైజేషన్ కు సందీప్ లాంటి డైరెక్టర్ యాడ్ అయితే అంచనాలు కూడా భారీగా ఉంటాయి. సో ఇన్నాళ్లు వీరి కాంబోలో స్పిరిట్ సెట్ అయ్యింది. మరి ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:

Advertisement

Latest News