వైట్ టీ షర్ట్ ఉద్యమంతో రాహుల్ గాంధీ

By Ravi
On
వైట్ టీ షర్ట్ ఉద్యమంతో రాహుల్ గాంధీ

బీహార్ లోని బెగుసరాయ్ లో NSUI నేషనల్ ఇన్ ఛార్జ్ కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ వైట్ టీ షర్ట్ ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో యువతకు ఉద్యోగాలు ఏవని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు పారిపోవద్దని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలు విని ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు. కాగా ముందుగా రాహుల్ మీడియాలో మాట్లాడుతూ.. బీహార్‌లో నిర్వహిస్తున్న వైట్‌ టీ షర్ట్‌ ర్యాలీలో యువత పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు. 

విద్యార్థులు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం ఆపాలని.. అందరం కలిసి రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం మొదలైన సమస్యలపై పోరాటం చేద్దామని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఇక రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ రెస్పాన్డ్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి మరో ఫెయిల్యూర్ రాబోతుందని కామెంట్ చేసింది. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ పోతుందని, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ ఎన్నికల్లో ఈ విషయం ఇప్పటికే ప్రూవ్ అయ్యిందని అన్నారు. ఇక బీహార్ లో కూడా కాంగ్రెస్ ను ముంచేందుకు మాత్రమే రాహుల్ కంకణం కట్టుకున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ అన్నారు. కాగా ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:

Advertisement

Latest News