వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్ 

By Ravi
On
వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్ 

పార్వతీపురం మన్యం జిల్లా

నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు,ఆర్సిహెచ్ రికార్డులు  పరిశీలించి ఎంత మంది పిల్లలు, గర్భిణీలకు వైద్య సిబ్బంది టీకాలు వేశారు,షెడ్యూల్ ప్రకారం వారి గడువు తేదీలు,ఏ ఏ వ్యాక్సిన్ వేయడం జరిగింది క్షుణ్ణంగా పరిశీలించారు.యువిన్ పోర్టల్ గమనించారు.పూర్తి చేసిన ప్రతీ టీకా వివరాలు అదే రోజు ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. గర్భిణిలతో మాట్లాడి ఆరోగ్య స్థితి తెలుసుకున్నారు.గర్భిణీలు,బాలింతలు పౌష్టికాహారం సరిగా తీసుకోవాలని తద్వారా వారితో పాటుగా పిల్లల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు.వైద్య సిబ్బంది టీకాలు వేసే ముందు వాటి ఆవశ్యకతపై అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల క్రమంలో చాలా వ్యాదుల నుండి రక్షణ పొందడానికి టీకాలు సకాలంలో వేయడం ఆవస్యకమని పోలియో, క్షయ, హెపటైటిస్, న్యుమోనియా, కోరింతదగ్గు, కంఠసర్పి,దనుర్వాతం, తట్టు,రుబెల్లా, అతిసారం ,దృష్టి సమస్యలు మొదలగు ప్రాణాంతక వ్యాదులకు గురికాకుండా కాపాడుకోవచ్చన్నారు.అనంతరం పిల్లల బరువు,ఎత్తు కొలతల వివరాలపై అంగన్వాడీ సిబ్బంది ఆరా తీసారు.వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో పిల్లలు,గర్భిణీల ఆరోగ్యంపై అధిక ఉష్ణోగ్రతల ప్రభావం లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యాలయ డెమో వై.యోగీశ్వరరెడ్డి,వైద్య సిబ్బంది ప్రమీల,అనూష,అంగన్వాడీ సిబ్బంది అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య? బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య?
నందమూరి నటసింహం బాలయ్య ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ క్రేజీ లైనప్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఆయన సిల్వర్ స్క్రిన్ తో పాటు బుల్లితెర...
అఖిల్ 6.. గ్లింప్స్ రిలీజ్ టైమ్ ఫిక్స్..
రామ్ చరణ్ పెద్ది సరికొత్త రికార్డ్..
స్పిరిట్ పై సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. 
బ్యాక్ టు బ్యాక్ లైనప్ తో బాలయ్య..
ఆధిపత్య పోరులో యువకుడు బలి..!
ధర లేక పొగాకు రైతుల ఆవేదన..!