యు. కొత్తపల్లి కొమరగిరి చెరువులను పరిశీలించిన వర్మ
పేదలకు ఇచ్చిన హామీని గవర్నమెంట్ నిర్వహిస్తున్న వర్మ
కాకినాడ జిల్లా, పిఠాపురం:
మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ సోమవారం కొమరగిరి మండలంలో ఉన్న చెరువులను పరిశీలించారు. ఈ సందర్బంగా, ఆయన పేద ప్రజలతో మాట్లాడుతూ, ఉప్పాడ మీటింగ్ సమయంలో కొణిదెల పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను గుర్తుచేశారు. అప్పట్లో ఇచ్చిన హామీ ప్రకారం, కొత్తపల్లి మండలంలోని మత్స్యకారుల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వర్మ అంగీకరించారు.
వర్మ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో జగనన్న లే అవుట్ పేరుతో 300 ఎకరాల మట్టి నింపడం జరిగింది. ఇది పూర్తి అవినీతికి దారితీసింది. 40 కోట్ల రూపాయల అవినీతికి, మట్టి తవ్వకాల్లో 50 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వర్మ ఆరోపించారు. మరింతగా, మట్టి ఫీలింగ్ లేకుండా ఈ భూములను బెయిట్ అవుట్ చేయడం జరిగిందని చెప్పారు.
2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మత్స్యకారుల కోసం కొమరగిరి పంచాయతీ కోసం 100 ఎకరాల భూమి ని ఎస్సీ జడ్ లో నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ, తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ భూములు 172 ఎకరాలకు చేరాయి.
కొమరగిరి, పిఠాపురం, ఆనంద నగరం, గొల్లప్రోలు తదితర ప్రాంతాల్లో లే అవుట్ చేయబడిన భూముల విషయంలో పేదలకు మరియు మత్స్యకారులకు ఇచ్చే హామీలు ఇప్పటికీ నిలబడి ఉంటాయని వర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానంద రెడ్డి, కఠారి రాజబాబు, మాజీ జడ్పిటిసిరాజేష్, రాయుడు శ్రీరాములు, గోర్స సర్పంచ్ రొంగల వీరబాబు, మాజీ ఎంపీటీసీ సన్నీబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.