బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి..!
By Ravi
On
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సికింద్రాబాద్ జీఆర్పీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక సుచిత్ర బీహెచ్ఈఎల్ క్వార్టర్స్‌లో ఉండే రాజ్వీర్ సింగ్ ఠాకూర్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడని రైల్వే పోలీసులు తెలిపారు. అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో నాయనమ్మ, చిన్నాన్న వద్ద ఉంటున్నట్లు పోలీసులు చెప్పారు. కొంత కాలంగా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. అప్పులు ఎక్కువ అవడంతో మనస్థాపానికి గురై తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైల్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Tags: