యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు - మాజీ మంత్రి హరీష్ రావు

By Ravi
On
యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు - మాజీ మంత్రి హరీష్ రావు

యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం- మాజీ మంత్రి హరీష్ రావు

మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే, నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి.  ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను పునరావృతం చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. బీఆర్ఎస్ పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గం. రైతు డిక్లరేషన్ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో మోసం చేసారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నరు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

Tags:

Advertisement

Latest News