డిసిఏ అదుపులో నకిలీ ఔషధాలు నిల్వ చేసిన పాత నేరస్తుడు..
By Ravi
On
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు జరిపారు. నగరంలోని మూసారాంబాగ్, మలక్‌పేట్ ప్రాంతంలోని ఓ పాత నెరస్థుడి ఇంట్లో సోదాలు నిర్వహించి భారీగా నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. పువ్వడ లక్ష్మణ అనే పాత నేరస్థుడు రాష్ట్రంలో పలు నకిలీ ఔషధాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతను తన నివాసమైన మూసారాంబాగ్, మలక్‌పేట్ లో అనధికారికంగా నకిలీ ఔషధాలను నిల్వ ఉంచుతున్నట్టు సమాచారం అందడంతో అధికారులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో మధుమేహం, రక్తపోటు, గర్భస్రావానికి సంబంధించిన నకిలీ ఔషధాలు లాంటి నాలుగు రకాల నకిలీ ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారుగా రూ. 5.21 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇలాంటి వ్యక్తులు, మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Tags: #drugscontrolathority#
Related Posts
Latest News
06 Jun 2025 19:22:43
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్లోని పిస్తా హౌస్ హోటల్లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్...