బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు

By Ravi
On
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు

తనపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్న రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని బడంగిపేట మున్సిపల్ కార్పోరేషన్ బీజేపీ అధ్యక్షుడు రామకృష్ణరెడ్డి బాలపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. కొద్దీ రోజుల క్రితం రోహింగ్యాలు అనుమానాస్పదంగా తిరుగుతున్న  వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగిందని, దీనిపై తనకు బెదిరింపు పోస్టులు చేయడమే కాకుండా  తన ఇంటి వద్ద అనుమానాస్పదంగా కొందరు తిరగడమే కాకుండా తనను ఫాలో అవుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనపై అనుచిత పోస్టులు పెట్టి బెదిరింపులకు పాల్పడిన రోహింగ్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రామకృష్ణరెడ్డితో పాటు ఆయన వెంట శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్, చైతన్య, పవన్, రమేష్ నాయక్, రఘు నాయక్ వున్నారు.IMG-20250511-WA0024

Tags:

Advertisement

Latest News