సంధ్యాథియేటర్ ఘటనపై సీపీ సివి ఆనంద్ కు నోటీసులు జారీ
By Ravi
On
సంధ్య థియేటర్ ఘటనపై సీవీ ఆనంద్‌కు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది.సంధ్య థియేటర్ లో పుష్పా సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని జనవరిలో పోలీసులను హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఇచ్చిన నివేదికలో సరైన వివరాలు లేవని, పోలీస్ స్టేషన్ కు సమీపంలో డీజేలు, ఇంత హంగామా జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. అల్లు అర్జున్ రావడం వల్లనే తొక్కిసలాట జరిగిందని, లాఠీ ఛార్జ్ చేయలేదని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. అసలు స్పెషల్ షోకు అనుమతి ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ థియేటర్ కి ఎలా వస్తారంటూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Tags:
Latest News
24 May 2025 18:59:20
గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. శనివారం సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నుంచి గ్రామ పాలన...