నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
నకిలీ ఔషధాలపై దాడులు పట్ల జాగ్రత్తగా ఉండాలని ఔషధ నియంత్రణ శాఖ డిసిఏ హెచ్చరించింది. ఇందుకు గాను ప్రజలకు పలు సూచనలు చేసింది. ప్రజలు మెడికల్ షాపులు లేదా ఫార్మసీల నుంచి షెడ్యూల్ H2 ఫార్ములేషన్ బ్రాండ్లను కొనుగోలు చేసే ముందు లేబుల్లపై ఉన్న బార్ కోడ్ / QR కోడ్ వివరాలను తప్పనిసరిగా ధృవీకరించాలని, నకిలీ / కౌంటర్ఫిట్ ఔషధాల బాధను తగ్గించడానికి మరియు ప్రజల ఆరోగ్యం, భద్రతను రక్షించడానికి తాము చర్యలు తీసుకుంటున్నమని డిసిఏ తెలిపింది. సరైన బార్ కోడ్ / QR కోడ్ లేబుల్లు లేకపోవడం, లేదా ప్రదర్శించిన వివరాలు సరిపోకపోవడం వంటి అనుమానాస్పద ఔషధ ఉత్పత్తులను ప్రజలు తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖకు తెలియజేయాలని అధికారులు కోరారు. QR కోడ్ ద్వారా బ్యాచ్ వివరాలు చూపించాల్సిన అవసరం ఉందని ఏదైనా వివరాల కోసం మీరు DCA అధికార వెబ్సైట్ను ప్రజలు సందర్శించవచ్చు లేదా వారి హెల్ప్లైన్కు సంప్రదించవచ్చని తెలిపారు.