చందానగర్ సెంట్రో షోరూమ్ లో అగ్నిప్రమాదం

By Ravi
On
చందానగర్ సెంట్రో షోరూమ్ లో అగ్నిప్రమాదం

చందానగర్ పిఎస్ పరిధిలో అగ్నిప్రమాదం సంభవించింది. గంగారంలో ఉన్న సెంట్రో షోరూమ్ లోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన ఉద్యోగులు, యాజమాన్యం వెంటనే అప్రమత్తమైన్నారు. షోరూమ్ లో ఉన్న కస్టమర్లను బయటకు పంపి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మొదటి అంతస్తులో  షాట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిప్రమాదం మూలంగా స్థానికంగా కలకలం రేగింది. పక్కనే ఉన్న ఆర్. కె కలెక్షన్ షాపింగ్ మాల్ కి సైతం మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం వల్ల సుమారు కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్థంభించిపోయింది.

Tags:

Advertisement

Latest News