భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి.. భరోసా ఇస్తున్న సిటీ పోలీసులు

By Ravi
On
భయపడకండి.. అప్రమత్తంగా ఉండండి.. భరోసా ఇస్తున్న సిటీ పోలీసులు

డోంట్ వర్రీ మేము ఉన్నావు.. వదంతులు నమ్మకండి.. అనుమానంగా ఎవరైనా తిరిగితే ఒక్క కాల్ చేయండి అంటూ హైదరాబాద్ పోలీసులు జనాల్లో భరోసా కల్పిస్తున్నారు. కమిషనర్ సి.వి. ఆనంద్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఆసీఫ్ నగర్ డివిజన్ లో పోలీసులు బస్తీలు, కాలనీలలో పెట్రోలింగ్ నిర్వహించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి కొత్తగా వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు కనిపించిన, వ్యక్తులు తిరిగిన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మవద్దని రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. స్థానిక ప్రాంతాల్లో ఉన్న షాప్స్, మాల్స్ లలో సిసి కెమెరాల పనితీరు పరిశీలించారు. IMG-20250509-WA0039

Tags:

Advertisement

Latest News