ధర్మోజికుంటలో దారుణం.. డంపింగ్ యార్డులా మారిన వైనం

By Ravi
On
ధర్మోజికుంటలో దారుణం.. డంపింగ్ యార్డులా మారిన వైనం

ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కబ్జాకు గురవుతున్న ధర్మోజి కుంట

హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన పట్టించుకోని అధికారులు

రోజు రోజుకు కుదించుకు పోతున్న కుంట

డంపింగ్ యార్డులా మార్చిన స్థానిక నేతలు

శంషాబాద్ పట్టణంలోని ధర్మోజి కుంట డంపింగ్ యార్డులా మారిపోయింది. విచ్చలవిడిగా వ్యర్ధాలు పారబోస్తుండటంతో కుంట ఉనికిని కోల్పోయే ప్రమాదంలో పడుతోంది. ధర్మోజి కుంIMG-20250512-WA0043ట రక్షించడంతో ఇరిగేషన్ అధికారుల వైఫల్యంతో పాటు దానిని పరిసరాలను అభివృద్ధి చేయడంతో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కాస్తా భవిష్య త్తులో మ్యాపులకే పరిమితమై పోయేలా ఉంది.
పట్టణంలోని సర్వే నంబరు 73లో ధర్మోజి కుంట 10 ఎకరాల 12 గుంటల్లో విస్తరించి ఉంది. గొలుసుకట్టు చెరువుగా ఉన్న ఈ చెరువు గతంలో సమీపంలోని వ్యవసాయ పోలాకు జీవనాధారం గా ఉండేది. సమీపంలో కాలనీలో వెలియడంతో  పాటు పై నుంచి వచ్చే నీటి వనరులకు సంబంధించిన  స్థలాల్లో కూడా భారీ భవంతులు నిర్మితమయ్యాయి. ప్రస్తుతం చెరువుకు సంబంధించిన స్థలం మాత్రమే మిగిలింది. దీనిని కూడా ఆక్రమించుకునే ఆలోచనల్లో కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున డంపింగ్ వ్యర్థాలు ధర్మోజి కుంటలో పారబోస్తున్నారు. దీంతో కుంట సింహభాగం డంపింగ్ వ్యర్థాలతో నిండిపోయింది. చనిపోయిన జంతు కళేబరాలు, పందులకు ఆవాసంగా మారింది.
ధర్మోజి కుంట ఎగువభాగంలో ఓ రాజకీయ పలుకుబడి గలిగిన వ్యక్తి భారీ ఎత్తున ప్రహరీని నిర్మించాడు. బఫర్ జోన్లోనే ప్రహరీ ఉన్న సంగతి సాక్షాత్తు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీ లించి ఇరిగేషన్ అధికారిని హెచ్చరించారు. వెంటనే బఫర్జోన్ లో ఉన్న ప్రహరీని తొలగించాలని సూచించారు. అయినా నేటికీ ప్రహరీ అలాగే ఉంది. హైడ్రా కమిషనర్ ఆదేశించినా బఫర్ జోన్లో ఉన్న ప్రహరీ తొలగించకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్ష ణకు ఇరిగేషన్ శాఖ పట్టించుకోకపోవడంతో పాటు చెరువు అభివృద్ధి స్థానిక సంస్థలు కూడా జోక్యం చేసుకోకపోవడంతో ధర్మోజి కుంట పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయి కబ్జారాయుళ్ల చేతుల్లోకి పోతుందేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Tags:

Advertisement

Latest News

దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపండి. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపండి. ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి
ప్రభుత్వానికి దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సిపాలిటీ ప్రీమియర్ ఫంక్షన్ హాల్‌లో కళ్యాణ లక్ష్మి...
తలకోనలో తలదించుకునే పనులు
ధర్మోజికుంటలో దారుణం.. డంపింగ్ యార్డులా మారిన వైనం
సమస్యలకు కేరాఫ్ అడ్రస్..మైలార్ దేవులపల్లి. బిఆర్ఎస్ ఆరోపణ
ఆపరేషన్ సూరత్ షురూ..20మంది ఖేల్ ఖతం
గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు