తిరుమలలో నమాజ్ కలకలం...
భక్తుల రద్దీ.. హనుమాన్ జయంతి వేడుకల్లో కిక్కిరిసి పోయిన తిరుమలలో ఒక్కసారిగా కలకలం రేగింది. హనుమజ్జయంతి వేడుకలు సాగుతున్న పరిస్థితుల్లో దిగ్బ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఒకరు తిరుమలలో నమాజ్ చేయడం కనిపించింది. తిరుమలలో గల కళ్యాణ మండపం ప్రాంగణానికి సమీపంలో ఆ వ్యక్తి హజ్రత్ టోపీ ధరించి నమాజ్ చేయడానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనతో అక్కడ కలకలం చెలరేగింది. ఆ వ్యక్తి 10 నిమిషాలకు పైగా తిరుమల కల్యాణ మండపం సమీపంలో నమాజ్ చేశాడని, ఇది చూసిన చాలామంది శ్రీవారి భక్తులు దిగ్భ్రాంతికి గురి అయ్యారు. విషయం తెలుసుకున్న పాలకమండలి సభ్యులు దీనిపై ఆరా తీస్తున్నారు. తమిళనాడుకి చెందిన వాహనంలో వచ్చిన ఆ వ్యక్తి గురించి వివరాలు సేకరిస్తున్నారు. వాహనం నెంబర్ ఆధారంగా వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు.