తలసేమియా బాధితుల కోసం రక్తదాన శిబిరం
By Ravi
On
తలసేమియా బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా అన్నారు. బాధితుల సౌకర్యార్థం పాతబస్తీ ఛత్రినాఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్డి ఫంక్షన్ హాల్ నందు తలసేమియా బాధితుల కొరకు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డిసిపి స్నేహ మెహర హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, పోలీస్ సిబ్బంది, పాత్రికేయులు పాల్గొని రక్తదానం చేశారు. ఇలాంటి శిబిరాల వల్ల వ్యాధి గ్రస్తులకు సకాలంలో రక్తం అంది ప్రాణాలు కాపాడిన వారిమి అవుతామని డీసీపీ చెప్పారు. జర్నలిస్టులు సైతం రక్తదానం చేయడం అభినందనీయమన్నారు.
Tags:
Latest News
21 May 2025 21:30:00
చత్తీస్ ఘడ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్...