సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....

By Ravi
On
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....

జూన్ 1 నుంచి థియేటర్ల మూసివేత నిర్ణయం వాయిదా పడింది. ఫిలిం ఛాంబర్‌లో పంపిణీదారులు, నిర్మాతలతో కీలక చర్చలు జరిగిన నేపధ్యంలో సమ్మె వద్దని, చర్చలతోనే పరిష్కారమని మెజారిటీ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో బంద్‌లు, నిలిపివేతలతో ఫలితం లేదన్న వాదనతోనే సినిమాలు నడుపుతూనే సమస్యలు పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు. పైరసీ, ఓటీటీ దెబ్బకు తగ్గిన ప్రేక్షకులు, వరుస సినిమాల విడుదల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పలువురు తెలిపారు.జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం ప్రస్తుతానికి వాయిదా పడింది. ఈ విషయమై మంగళవారం తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో ఉదయం నుంచి నిర్మాతలు, పంపిణీదారులతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. థియేటర్లను నడుపుతూనే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు తెలిసింది.
 ఉదయం 11 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లతో సమావేశమయ్యారు. ఈ భేటీకి సుమారు 40 మంది డిస్ట్రిబ్యూటర్లు హాజరైనట్లు సమాచారం. అనంతరం, సాయంత్రం 4 గంటలకు తెలుగు నిర్మాతలతో ఛాంబర్ పెద్దలు చర్చలు జరిపారు. ఈ రెండు సమావేశాల్లోనూ థియేటర్ల మూసివేత ప్రతిపాదనపై వాడివేడిగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలలో అత్యధిక శాతం మంది సభ్యులు థియేటర్ల సమ్మెకు సుముఖత చూపలేదని, ప్రదర్శనలు కొనసాగిస్తూనే సమస్యలను పరిష్కరించుకునే దిశగా కృషి చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో క్యూబ్ సమస్యలపై కొన్ని రోజుల పాటు థియేటర్లు మూసివేయడం, అలాగే నటీనటుల పారితోషికాల విషయంలో కొన్ని రోజుల పాటు షూటింగులు నిలిపివేయడం వంటివి జరిగాయని, అయితే ఆ రెండు సందర్భాల్లోనూ ఆశించిన స్థాయిలో సత్ఫలితాలు రాలేదని పలువురు సభ్యులు గుర్తుచేశారు. ఈ అనుభవాల దృష్ట్యా, ఈసారి థియేటర్లు మూతపడకుండా, సినిమాలు ప్రదర్శిస్తూనే సమస్యలకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనాలని వారు సూచించారు.
ప్రస్తుతం పైరసీ, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు, ఓటీటీ వేదికల ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం గణనీయంగా తగ్గిపోయిందని డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి తోడు మే 30 నుంచి పలు సినిమాలు వరుసగా విడుదల కానున్నాయని, ఇలాంటి కీలక సమయంలో థియేటర్లు మూసివేస్తే పరిశ్రమకు మరింత నష్టం వాటిల్లుతుందని వారు పేర్కొన్నారు. కాబట్టి, థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు వారు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో జూన్ 1 నుంచి జరగాల్సిన థియేటర్ల బంద్ ప్రస్తుతానికి ఆగిపోయినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తదుపరి చర్చల ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా అడుగులు పడనున్నాయి.

Tags:

Advertisement

Latest News

ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చత్తీస్ ఘడ్ అడవుల్లో  తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  ఆపరేషన్ కగార్...
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి