రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు

By Ravi
On
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు

 శివారు ప్రాంతాలైన ముత్తంగి, ఇస్నాపూర్, రుద్రారం మీదుగా సంగారెడ్డి చౌరస్తా వరకు ముంబై జాతీయ రహదారి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ విస్తరణ పనుల్లో భాగంగా అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నాలాల ఆక్రమణలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం రహదారులను విస్తరిస్తుంటే, కొందరు స్వార్థపరులు మాత్రం ఇష్టారాజ్యంగా నాలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇది కేవలం ప్రభుత్వ భూముల ఆక్రమణ మాత్రమే కాదు, భవిష్యత్తులో వరదలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
విశేషంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ నాలా కబ్జాలు ఇరిగేషన్ శాఖ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతికి అలవాటు పడి కబ్జాదారులకు సహకరిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విస్తరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో నాలాలు కనుమరుగవుతున్నా, ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇంత పెద్ద ఎత్తున నాలా కబ్జాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారి అలసత్వానికి కారణమేమిటి? ఇటీవల ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన దాడుల అనంతరం  కూడా ఉద్యోగుల ప్రవర్తనలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. లంచగొండితనం, నిర్లక్ష్యం యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులు పక్కా సమాచారం మేరకు ఇరిగేషన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో కొందరు అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని వార్తలు వచ్చాయి. దీంతో కార్యాలయంలో కొంతకాలం పాటు అలజడి నెలకొంది. ఈ ప్రశ్నలు ఇప్పుడు సామాన్య ప్రజలను వేధిస్తున్నాయి.
ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నాలా కబ్జాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇరిగేషన్ శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా, నాలా కబ్జాల జిల్లా కలెక్టర్ కూడా స్వయంగా దృష్టి సారించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల భద్రత, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఈ నాలా కబ్జాల భాగోతానికి చరమగీతం పాడాలని ఆశిద్దాం.IMG-20250521-WA0072

Tags:

Advertisement

Latest News

ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి ఆపరేషన్ కగార్.. బాబుపై బాంబుదాడి సూత్రదారి మృతి
చత్తీస్ ఘడ్ అడవుల్లో  తుపాకుల మోత మోగుతోంది. మా వోయిస్టులను భద్రతా దళాలు చుట్టు ముట్టాయి. దీంతో, మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది.  ఆపరేషన్ కగార్...
చదివింది విదేశాల్లో.. డ్రగ్స్ వ్యాపారం స్వదేశంలో
సినీ ప్రేక్షకులకు శుభవార్త.. ఆ నిర్ణయం ఇక లేనట్లే....
చార్ధామ్ యాత్ర పేరుతో చావు పరిచయం.. ప్రకటనలతో పంగానామలు పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యం
రోడ్డు విస్తరణలో బయటపడ్డ అక్రమాలు.. కబ్జారాయుళ్లతో అధికారుల కుమ్మక్కు
#Draft: Add Your Title
బంజారాహిల్స్ లో మహిళా వైద్యురాలిపై లైంగిక దాడి