కారులో బెల్లంఆలం తరలింపు..గుట్టురట్టు చేసిన ఎక్సైజ్ టీమ్
By Ravi
On
హైదరాబాద్ నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి బెల్లంఆలం కారులో తరలిస్తున్నారని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ ఎస్సై బాలరాజు టీం కలిసి హైదరాబాద్ శివారు బిఎన్ రెడ్డి కాలనీ సమీపంలో దాడి చేశారు. కారులో తరలిస్తున్న 570 కేజీల బెల్లం,50 కేజీల ఆలం విలువ రూ. 62 వేలుగా ఉంటుందని గుర్తించారు. బెల్లాన్ని తరలిస్తున్నటువంటి కారుని సీజ్ చేశారు. ఈ బెల్లాన్ని నల్లగొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆంబోతు తండాకు తరలిస్తున్నట్లు కారు డ్రైవర్ రాజు విచారణలో వెల్లడించాడు. ఈ కేసులో కారు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు ఎస్సై బాలరాజ్ తెలిపారు. బెల్లాన్ని పట్టుకున్నటువంటి టీమును ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం , టీం లీడర్ ప్రదీప్ రావు అభినందించారు.
Tags:
Latest News
07 May 2025 22:18:53
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ...